పూరీ జగన్నాథ్ హిట్ల లో ఉన్నా..ఫ్లాప్‌ల్లో ఉన్నా..ఆ పేరుకు ఉన్న క్రేజ్ అలాంటిది. హీరోతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ కొట్టగల దమ్మునోడు. స్టార్ హీరోఐనా..యంగ్ హీరోలతో అయినా మూడు నెలల్లో సినిమా పూర్తీ చేయడం ఈ డాషింగ్ డైరెక్టర్ మరో స్పషాలిటీ. అలాగే సినిమాకు టైటిల్స్ పెట్టడంలో మనోన్ని మించినవాడు లేడు. సినిమా ఎలా ఉండబోతోందో టైటిల్ తోనే హింట్ ఇస్తాడు. ఇడియట్, పోకిరి,దేశముదురు, టెంపర్, లోఫర్ ఇలా మాస్ టైటిల్స్ పెట్టాలన్నా..అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి పొయటిక్ టైటిల్స్‌తో ఆకట్టుకోవాలన్నా పూరికే చెల్లింది. టైటిల్స్ విషయంలో ఎప్పుడు కొత్తదనం చూపించే పూరీ తాజాగా మరో డిఫెరెంట్ టైటిల్ తో రాబోతున్నాడు.
ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ అందించటంలో విఫలమవుతున్న పూరి జగన్నాథ్, ఓ బిగ్ హిట్‌తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే యంగ్ హీరోలతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న పూరి, ఆ తరువాత చేయబోయే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. అంతేకాదు ఈ సినిమాకు మరోసారి తన మార్క్ కనిపించేలా డిఫరెంట్ టైటిల్‌ను పిక్స్ చేశాడు. ముగ్గురు హీరోలతో రూపొందించనున్న ఈ సినిమా కోసం మూడు కోతులు ఒక మేక అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.