త్వరలో సెట్స్‌ పైకి పూరి మార్క్‌… ‘జనగణమన’

239
Puri Jagannath on Jana Gana Mana movie
- Advertisement -

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలో పూరీ పేరు ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ ముందు విచారణకు హాజరైన పూరీ తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని తెలిపాడు. డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు రావడం కుటుంబసభ్యులను కలచివేసిందన్నారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్టు గురించి మాట్లాడిన పూరీ జగగణమన తెరకెక్కించి తీరుతానని స్పష్టం చేశాడు.

దేశం మీద ఎంతో ప్రేమ ఉండబట్టే అలాంటి స్క్రిప్టు తయారుచేయ గలిగానని  చెప్పాడు. అంతేగాదు  ఈ సినిమాలో  డ్రగ్స్‌ వ్యవహారంతోపాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న ఇతర విషయాలను గురించి చర్చించనున్నట్టు తెలిపాడు. ఇక ఈ సినిమాకు   ‘లవ్‌ ఇండియా.. హేట్‌ ఇండియన్స్‌’ అంటూ ఓ ట్యాగ్‌లైన్‌ కూడా తగిలించాడు. నిజానికి ఈ సినిమాను మహేష్‌తో తెరకెక్కించబోతున్నట్టు ఏడాది క్రితమే పూరీ జగన్నాథ్ ప్రకటించాడు.

ప్రస్తుతం తాను ఎదుర్కొంటోన్న పరిణామాల కారణంగా ఈ కథను తెరకెక్కించాలనే పట్టుదల తనలో మరింత పెరిగిందని ఆయన అన్నాడు. దేశంలో వున్న అనేక రకాల సమస్యలు ఈ స్క్రిప్ట్ లో చోటుచేసుకుంటాయని చెప్పాడు. ‘ఐ లవ్ ఇండియా .. ఐ హేట్ ఇండియన్స్’ అనే ట్యాగ్ లైన్  ఎందుకు పెట్టాననేది ఈ సినిమా చూసిన తరువాత అర్థమవుతుందని చెప్పుకొచ్చాడు.

- Advertisement -