ఆర్సీబీకి మరో పరాజయం…

168
rcb
- Advertisement -

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా రెండో ఓటమిని మూటగట్టుకుంది ఆర్సీబీ. ఇక వరుస ఓటములతో ఢీలా పడ్డా పంజాబ్‌ తిరిగి గాడిన పడింది. పంజాబ్ విధించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసింది.దీంతో ఆర్సీబీపై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది పంజాబ్.

విరాట్‌ కోహ్లి (34 బంతుల్లో 35‌), హర్షల్‌ పటేల్‌ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్‌ పటిదార్‌ (30 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. 19 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసిన పంజాబ్‌ కింగ్స్‌ ఎడంచేతి వాటం స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ఇక అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (57 బంతుల్లో 91 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా… క్రిస్‌ గేల్‌ (24 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఇన్నింగ్స్‌లో నాలుగోసారి డకౌట్‌ కావడం విశేషం.

- Advertisement -