IPL 2025: చెన్నై నాలుగో ఓటమి

1
- Advertisement -

ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై వరుస ఓటములతో సతమతమవుతోంది. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది చెన్నై. 220 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. కాన్వే హాఫ్ సెంచరీ 49 బంతుల్లో 69 పరుగులు చేయగా శివమ్ దూబే 42 పరుగులు, ధోని 27 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో చెన్నై ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 219 పరుగులు చేసింది. యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 37 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో చెన్నై బౌలర్లను ఉచకోత కోశాడు. ఫలితంగా పంజాబ్ భారీ స్కోరు సాధించింది.

ఈ సీజన్ లో ఇప్పటివరకు 5 మ్యాచులో ఆడిన చెన్నై నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పంజాబ్ మూడు విజయాలతో దూసుకుపోతోంది.

Also Read:గుజ‌రాత్‌లో కాంగ్రెస్ మేథోమధనం

- Advertisement -