ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు..

127
puneeth rajkumar
- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఇంట్లోనే ఆయన కుప్పకూలగా డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పునీత్ మృతితో కన్నడనాట తీవ్ర విషాదం నెలకొంది. పునీత్ రాజ్‌ కుమార్ అంత్యక్రియలు ఆయన కూతురు యుఎస్‌ నుండి వచ్చాకే చేయనున్నారు.పునిత్ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ సమాధి పక్కనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆయన మృతికి సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా నివాళులు అర్పిస్తున్నారు. కంఠీరవ స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సీఎం బసవరాజ్ బొమ్మై సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే పునీత్ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.

- Advertisement -