పునీత్ మృతి బాధాకరం..

133
Rajendraprasad
- Advertisement -

చిన్న వయసులోనే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందడం బాధాకరమన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇవాళ ఉదయం బెంగళూరులోని పునీత్ నివాసానికి వెళ్లిన ఆయన పునీత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

చిన్న వయసులో పునీత్ దూరమవ్వడం బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, పునీత్ కుటుంబం ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు. పునీత్ భార్యకు ధైర్యం చెప్పారు. పునీత్ రెండో అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్‌తో మాట్లాడారు.

పునీత్‌ను చివరిసారి చూడలేక పోయిన నాగార్జున, రామ్ చరణ్ వంటి పలువురు టాలీవుడ్ ప్రముఖులు బెంగుళూరులోరి ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు.

- Advertisement -