కోవిడ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి..

149
cs
- Advertisement -

కోవిడ్ వ్యాధిపై అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారాన్ని నిర్వహించి ప్రజలలో మార్పు తీసుకోవాలని కేంద్ర క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరారు. గురువారం క్యాబినేట్ కార్యదర్శి Public Health Responsibility to Covid-19పై వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆర్ధిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభం కావడంతో పాటు పండుగ సీజన్, శీతాకాలం వస్తున్నందున కోవిడ్ వ్యాధి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శులను కోరారు. జన సమూహాలు లేకుండా చూడాలన్నారు. ప్రజలలో టెస్టింగ్ పట్ల ఉన్న భయాందోళనలు తొలగించి ఎక్కువ మంది కోవిడ్ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తి గత పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యకార్యదర్శి రిజ్వీ, ప్రజాఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -