ఎస్వీబీసీ ఛైర్మన్‌గా 30 ఇయర్స్‌ పృథ్వీ…

425
30 years prudhvi
- Advertisement -

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ నియ‌మితుల‌య్యారు. తిరుప‌తిలో జ‌రిగిన ఎస్వీబీసీ బోర్డు స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 28న ఎస్వీబీసీ ఛైర్మ‌న్‌, డైరెక్ట‌ర్‌గా ఆయన బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పృథ్వీ ఆ పార్టీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. అంతేగాదు జగన్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. వైసీపీ వాయిస్‌ని ప్రజల్లో బలంగా వినిపించడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించారు సీఎం జగన్‌.

తెలుగుదేశం హయాంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎస్వీబీసీ చైర్మన్‌గా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో రాఘవేంద్రరావు తన పదవికి రాజీనామ చేశారు. తాజాగా ఈ పోస్టులో మరోసారి సినిమారంగానికి చెందిన వ్యక్తికే అవకాశం లభించింది.

- Advertisement -