అలుపెరుగని సినీ కార్మికునికి నివాళులు

189
Dasari Narayana Rao No more
Dasari Narayana Rao No more
- Advertisement -

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాసరి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దాసరి నారాయణరావు సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారని సీఎం అన్నారు. సినీ రంగంలో ఎంతోమందిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కారణమైన ఆదర్శప్రాయుడన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో దాసరి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుందని సీఎం పేర్కొన్నారు.

దాస‌రి నారాయ‌ణరావు మృతిని తెలుగు సినీ పరిశ్ర‌మ జీర్ణించుకోలేక‌పోతోంది. కిమ్స్ ఆసుప‌త్రి వ‌ద్దకు సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు అక్క‌డికి త‌ర‌లివ‌స్తున్నారు. దాస‌రి మృతిప‌ట్ల తీవ్ర విచారాన్ని వ్య‌క్తం చేస్తూ క‌న్నీరు పెట్టుకున్నారు.

ఇటీవల మే 4న .దాసరి నారాయణరావు పుట్టినరోజు వేడుకను ఆయన నివాసంలో జరుపుకున్నారు. కొద్ది కాలం క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న దాసరి ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, కార్మిక నేతలు, సినీ కార్మికులు దాసరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. ఇంతలోనే దాసరి మరణించడం సినీ రంగానికి తీరని లోటుగా మిగిలింది.

hqdefault

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో 1947, మే 4న దాస‌రి జన్మించాడు. కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవారు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డారు. ఒకానొక సమయంలో ఆయన పేరిట 18,000 కు పైగా అభిమాన సంఘాలు ఉండేవి.

Dasari1

అత్యధిక చిత్రాల దర్శకుడుగా అనతి కాలంలోనే గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన దాసరి నారాయణరావును దర్శకరత్నగా అభివర్ణిస్తారు. తెలుగు సినిమా చరిత్రలో సినిమాపెద్ద దాసరి నారాయణరావు ది ఓ సువర్ణాధ్యాయం. బహుముఖ ప్రజ్ఞాశాలి.. అలుపెరగని సినీ కార్మికుడు. తెలుగు సినిమాకు ఆయన అందించిన విజయాలను వర్ణించడం అసాధ్యం. ఎందరినో స్టార్ హీరోలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది.

`తాతా మనవడు` నుంచి మొన్నటి `ఎర్ర బస్సు` వరకూ ఎన్నో విజయాలను అందుకున్నారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. 250 పైగా చిత్రాలకు రచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

Dasari2

దాసరి సినిమాలు `తాతా మనవడు`, `స్వర్గం నరకం`, `మేఘసందేశం`, `మామగారు` అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన `బొబ్బిలి పులి` `సర్దార్ పాపారాయుడు` చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.`మామగారు`, `సూరిగాడు`, `ఒసేయ్ రాములమ్మా` చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో దాసరి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డులు కూడా లభించాయి. అలాగే జాతీయ స్థాయిలో ఆయన మరెన్నో అవార్డులు అందుకున్నారు.

- Advertisement -