కొత్త వ్యవసాయ చట్టాలతో ప్రైవేట్ కంపెనీలకు మేలు జరుగుతుందని ఆరోపించారు ప్రొ. నాగేశ్వర్ రావు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ వికాస సమితి(టివిఎస్) ఆధ్వర్యంలో రైతు సంఘీభావ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రో.నాగేశ్వరరావుతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపి రెడ్డి ,తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కన్వీనర్ ఓ. నర్సింహ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొ నాగేశ్వర్…వ్యవసాయ చట్టలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది…ఈ చట్టంలో ఏముందో తెలుసుకోకుండా కొంతమంది మాట్లాడుతున్నారు అది సరికాదన్నారు.చట్టాలపై పూర్తి స్థాయి లో అవగాహన కలిగి ఉండాలి….చట్టంలో ఏం ఉందో తెలుసుకోవాలి…. చట్టం పూర్తిగా పెద్ద ప్రైవేట్ కంపెనీ లకు మాత్రమే స్వేచ్ఛ నిచ్చేలా ఉంది…దీంతో ప్రైవేట్ కంపెనీలకు మాత్రమే మేలు జరుగుతుందన్నారు.
దళారి వ్యవస్థ ను ప్రోత్సహించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం….రైతు పంట పండించుకోవడం ,పండిన పంటను నిల్వ చేసుకోవడం కూడా రైతు కు ఎప్పటి నుండో స్వేచ్ఛ ఉంది కొత్తగా మీరు ఇచ్చేది..కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాయడం కోసమే అన్నారు. ఈ చట్టం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం,రైతులు అందరూ సంఘటితంగా ముందుకు పోవాలన్నారు.