బండికి ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్నింగ్!

88
bjp
- Advertisement -

యస్…నేను మతతత్వవాదినే..బరాబర్ మతవిద్వేషాలు రగిలిస్తా అంటూ పాదయాత్ర చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిర్మల్‌ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశాడు. సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ పాకిస్తాన్‌లో కలిసేదంటూ వితండ వ్యాఖ్యలు చేశాడు. భౌగోళికంగా తెలంగాణ ఏం భారత సరిహద్దుల్లో లేదు..దేశానికి నట్టనడుమ ఉంది..పాకిస్తాన్‌లో ఎలా కలిసిపోతుందో బండికే తెలియాలి. అప్పటికే కమ్యూనిస్టుల సారథ్యంలో జరుగుతున్న తెలంగాణ సాయుధ పోరాటంతో నిజాం పాలన అంతిమదశకు వచ్చింది. ఆ ద శలో నాటి కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ పటేల్ నాయకత్వంలోని ఇండియన్ యూనియన్ సైన్యాలు ఆపరేషన్ పోలో చేపట్టడంతో నిజాం దిగివచ్చి భారత ప్రభుత్వంపై సంధి చేసుకున్నాడు. ఈ మేరకు తెలంగాణ భారత యూనియన్‌లా విలీనమైంది. కాని జాతీయ కాంగ్రెస్ నేత సర్దార్ పటేల్‌ను గుజరాతీ ఫీలింగ్‌తో ఓన్ చేస్తుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు చరిత్రకు వక్రభాష్యం చెబుతున్నారు. కేవలం సర్దార్ పటేల్ వల్లే తెలంగాణ భారత్‌లో కలిసింది…లేకుంటే పాకిస్తాన్‌లో కలిసేదంటూ..ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ మతిలేని వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఓ మీడియా డిబెట్‌లో ‎ఆయన మాట్లాడుతూ…సర్దార్ పటేల్ పోలీస్ యాక్షన్ వల్లనే తెలంగాణ భారత్‌లో విలీనం అయిందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టారు. చుట్టుముట్టూ సూర్యాపేట…నట్టనడుమ నల్లగొండ…గోల్కొండ ఖిల్లా కింద నీకు గోరీ కడతాం నైజాం సర్కరోడా..అని తెలంగాణ ప్రజలు గోల్కొండ ఖిల్లాను ముట్టడించే సమయం ఆసన్నమైనప్పుడు…ఇక నిజాంపాలన అంతమవుతుందన్న దశలో అప్పుడు హైదరాబాద్‌లో ఇండియన్ యూనియన్ ఆర్మీ ఎంటరైందని నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అందువల్ల ఇదేదో బీజేపీ నేతలు చెబుతున్నట్లు కేవలం సర్దార్ పటేల్ కృషి వల్లనే జరిగితే..మరి నాలుగు వేల మంది తెలంగాణ బిడ్డలు నాడు ఎందుకు అమరులు అవ్వాల్సి వచ్చింది…ఎందుకు భయంకరమైన అవమానాలకు, అత్యాచారాలకు ఆనాడు తెలంగాణ ప్రజలు గురవ్వాల్సి వచ్చింది అంటూ ప్రశ్నించారు.

ఇంకో విచిత్రం ఏంటంటే..నిజాం సరెండర్ అయిన తర్వాత ఆనాటి భారత ప్రభుత్వం నిజాంను రాజప్రముఖ్‌గా గుర్తించింది…మరి నిజంగా నిజాంను తరిమికొట్టేందుకు , నిజాం పాలనను అంతం చేసేందుకే..సర్దార్ పటేల్ వచ్చి ఉంటే… నిజాంను రాజప్రముఖ్‌గా ఎందుకు గుర్తించారని ప్రొఫెసర్ ప్రశ్నించారు. మీకు నిజంగా నిజాంపాలనను అంతం చేసి భారతదేశంలో కలపాలి అనుకుంటే ఎందుకు తెలంగాణలో వెంటనే ఎన్నికలు జరపలేదని నిలదీశారు. దీన్ని బట్టి నిజంగా తెలంగాణ సాయుధపోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, రైతులు, పీడిత, తాడిత ప్రజలంతా కలిసి చేసిన గెరిల్లాపోరాటాల వల్లనే తెలంగాణలో నిజాం పాలన అంతం అయిందని అని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. సర్వార్ పటేల్ లేకుంటే తెలంగాణ పాకిస్తాన్‌లో కలిసేదన్న బండి సంజయ్ వ్యాఖ్యలు అర్థంపర్థం లేవని కొట్టిపారేశారు. మొత్తంగా చరిత్ర తెలుసుకో బండి…మతం పేరుతో నీచ రాజకీయం చేయకు బండి సంజయ్‌పై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.

- Advertisement -