- Advertisement -
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతుండగా డబ్బుల ప్రవాహానికి అంతేలేదు. అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఈ ఉప ఎన్నికలు నిలవనుండగా మద్యం,డబ్బు ప్రవాహన్ని అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ అధినేత, ప్రోఫెసర్ కోదండరామ్.
అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుద్ద భవన్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో కోదండరాం మౌన ప్రదర్శనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగ బద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.
- Advertisement -