తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న టాప్ హీరోయిన్…

434
trisha krishanan
- Advertisement -

ఒక‌ప్పుడు తెలుగు తెర‌మీద అగ్ర‌క‌థానాయికగా ఓ వెలుగు వెలిగింది త్రిష‌. త‌న అందం, న‌ట‌న‌తో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో ఆమె న‌టించిన సినిమాలు చాలా వ‌ర‌కూ విజ‌యాన్ని సాధించాయి. దాదాపు తెలుగు లోని టాప్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించింది. అంతేకాకుండా త‌మిళంలో ఆమె న‌టించిన సినిమాలు భారీ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాయి. త‌మిళంలో అవ‌కాశాలు ఎక్కువ‌గా రావ‌డంతో అక్క‌డే సెటిల్ అయిపోయింది అమ్మ‌డు. దింతో తెలుగు లో ఎక్కువ‌గా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో త‌మిళంలోనే అడ‌ప‌ద‌డ‌పా సినిమాలు చేస్తుంది.

Trisha

త్రిష మ‌ళ్లి తెలుగులోకి రీ ఇంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా అమ్మ‌డుకు అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. శ‌త‌మానం భ‌వ‌తి సినిమా డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగ‌శ్న ప్ర‌స్తుతం నితిన్ తో శ్రీనివాస క‌ళ్యాణం అనే సినిమా తీస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈమూవీ షూటింగ్ స‌గం వ‌ర‌కూ పూర్తి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈచిత్రానికి నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్నాడు. నితిన్ స‌ర‌స‌న హీరోయిన్ గా రాశి ఖ‌న్నా న‌టిస్తోంది.

Trisha, sathish vegashna

ఇక త్రిష కోసం ఒక క‌థ‌ను రెడీ చేశాడు డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగ‌శ్న‌. పూర్తిగా లేడి ఓరియేంటెడ్ లో ఈస‌నిమా సాగ‌నుంద‌ని స‌మాచారం. ఆ సినిమా కోసం త్రిష‌ను సంప్ర‌దించాడ‌ట స‌తీశ్ వేగ‌శ్న‌. ఇందుకు త్రిష్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. కథ తన పాత్ర చుట్టూనే తిరిగేది కావడంతో ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. ఒక‌ప్పుడు తెలుగు తెర మిద వెలుగు వెలిగిన త్రిష రీ ఎంట్రీతో మ‌ళ్లి ఎంత మేర‌కు స‌క్సెస్ సాధిస్తోందో చూడాలి.

- Advertisement -