- Advertisement -
కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్. సినీ పరిశ్రమంతా స్తంభించిపోయింది. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను కాపాడటానికి సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ’కరోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ కళాకారులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు.
సి.సి.సి ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి 20 లక్షలు వితరణ చేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇప్పుడు రూ.10 లక్షల విరాళాన్ని సినీ కార్మికుల సహాయ నిధికి అందచేస్తున్నట్లు సంస్థ అధినేతలు దిల్ రాజు మరియు శిరీష్ ప్రకటించారు.
- Advertisement -