- Advertisement -
ప్రొ కబడ్డీ లీగ్ 2021లో బోణి కొట్టింది దబంగ్ ఢిల్లీ. గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 41–30 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్‌ను ఓడించింది. ఢిల్లీ రెయిడర్ నవీన్ కుమార్ ఏకంగా 16 పాయింట్లు స్కోరు చేసి అద్భుత ఆటతీరు కనబర్చాడు. మ్యాచ్‌లో కనీసం 10 పాయింట్లు స్కోరు చేయడం పీకేఎల్‌లో నవీన్‌కిది వరుసగా 22వ సారి కావడం విశేషం.
ఇక ఢిల్లీ జట్టులో ఆల్‌రౌండర్లు విజయ్ తొమ్మిది పాయింట్లు, సందీప్ నర్వాల్ మూడు పాయింట్లు స్కోరు చేశారు. పుణేరి పల్టన్ తరఫున కెప్టెన్ నితిన్ తోమర్ ఏడు పాయింట్లు, రాహుల్ చౌదరీ ఐదు పాయింట్లు సాధించారు. ఇక గురువారం జరిగిన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్ 42–39తో హరియాణా స్టీలర్స్‌పై, గుజరాత్ జెయింట్స్ 34–27తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించాయి.
- Advertisement -