రాధేశ్యామ్ …పక్కా లవ్‌స్టోరీనే:ప్రభాస్

47
prabhas

రాధేశ్యామ్ పక్కా లవ్‌స్టోరీ అని తెలిపారు యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్ మాట్లాడుతూ… ఇది మాములు లవ్ స్టోరీ కాదు.. గోపికృష్ణ సినిమా అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుందన్నారు. ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీనే కానీ .. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయన్నారు.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. పూజా ఈ సినిమాలో చాలా బాగా నటించిందన్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్ అదిరిపోతుందన్నారు. దర్శకుడు రాధాకృష్ణ…. 5 ఏళ్లు సినిమాలో కూర్చోడమంటే జోక్ కాదు.. సినిమా షూటింగ్‌కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు.

ట్రైలర్ లో ఆయన కష్టం స్పష్టంగా కనిపిస్తోందని… ఇదే సమయంలో సాహో ప్రమోషన్స్‌లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేశారు. ఈవెంట్‌ని సస్సెస్ చేసిన అభిమానుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభాస్.