శ్రీవారిని దర్శించుకున్న మహీంద్ర రాజపక్సే..

93
rajapakse

తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సే సతీసమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం అభిషేకం అనంతరం విఐపీ విరామ సమయంలో రాజపక్సే దంపతులు స్వామి సేవలో పాల్గొన్నారు. స్వామి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టిటిడి ఉన్నతాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.