నిన్ను చూస్తే గర్వంగా ఉంది

99
- Advertisement -

భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ…గడిచిన వందేళ్ల కాలంలో కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే గాంధీ కుటుంబేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు.

గత 24 ఏండ్లలో గాంధీ కుటుంబేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బుధవారం సోనియాగాంధీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఖర్గే.. సోనియాకు రాజీవ్‌ గాంధీ చిత్రాన్ని బహూకరించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా వైదొలగడం పట్ల ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీని ఉద్దేశిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా. ప్రపంచం ఏమనుకున్నా, ఏం ఆలోచించినా సరే.. నాకు తెలుసు ఇదంతా నువ్వు కేవలం ప్రేమ కోసమే చేశావని అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీంతో పాటు.. ఖర్గే బహూకరించిన చిత్రాన్ని చూపిస్తున్న సోనియా ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఖర్గే..బాధ్యతలు స్వీకరణ

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య

టీఆర్ఎస్‌లోకి చౌటుప్పల్ కాంగ్రెస్ నాయకులు..

- Advertisement -