రూసో సూపర్ షో..బంగ్లా ఓటమి

204
- Advertisement -

టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా విధించిన 206 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా తేలిపోయింది. భారీ ఓటమిని మూటగట్టుకుంది. కేవలం 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయి 104 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కొల్పోయి 205 పరుగులు చేశారు. డికాక్ 38 బంతుల్లో 63 పరుగులు చేయగా రిలీ రూసో సూపర్బ్ సెంచరీతో రాణించారు. కేవలం 52 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో విరుచుకపడ్డారు. 109 పరుగులు చేసిన అనంతరం రూసో పెవిలియన్ బాటపట్టగా టీ20ల్లో రూసోకు ఇది రెండవ సెంచరీ.

ఇవి కూడా చదవండి..

చాలా రోజుల తర్వాత టాప్‌టెన్‌లో విరాట్‌

ఆకాశమే నీకు హద్దుగా సాగిపో

ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌ గెలుపు

- Advertisement -