మోడీకి పోటీగా ప్రియాంక గాంధీ?

33
- Advertisement -

లోక్ సభ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. సరిగా వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రెల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారి కేంద్రంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలుగా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మోడీ నేతృత్వంలో మూడో సారి కూడా అధికారం చేపట్టాలని కాషాయదళం ప్రయత్నిస్తుంటే.. మోడీకి చెక్ పెట్టి తాము అధికారం చేపట్టాలని హస్తం పార్టీ నేత్లౌ భావిస్తున్నారు. దీంతో ఈ రెండు జాతీయ పార్టీల మద్య ఎన్నికల వేడి అప్పుడే తారస్థాయిలో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోడీ పోటీ చేసే స్థానంపై గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి..

ఈసారి మోడీ సౌత్ రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ముఖ్యంగా తమిళనాడులో ఏదో ఒక స్థానం నుంచి ప్రధాని బరిలో దిగుతారని వార్తలు ఎక్కువగానే వినిపించాయి. మోడీ ఇప్పటివరకు వారణాసి నుంచి బరిలోకి దిగుతూ వచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా వారణాసి నుంచి బరిలోకి దిగితే ప్రియాంక గాంధీ రూపంలో మోడీకి గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేయాలని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారని, ప్రధానికి పోటీగా ఇక్కడి నుంచి ఆమె బరిలోకి దిగితే బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం ప్రియాంక గాంధీకి దేశ ప్రజల్లో ఆధారణ బాగానే పెరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంలో ప్రియాంక గాంధీ కీ రోల్ పోషిస్తున్నారనడంలో ఎలాంటి సందేహంలేదు. ఈ నేపథ్యంలో మోడీని ఢీ కొట్టేందుకు ప్రియాంక గాంధీ సరైన నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీకీ పోటీగా వారణాసి నుంచి ప్రియాంకా గాంధీ బరిలో దిగిన ఆశ్చర్యం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:47 ఏళ్ల వయసులో మళ్లీ డిమాండ్

- Advertisement -