తన అందచందాల ఆరబోతతో బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ పాగావేసిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ఏ మాత్రం మొహమాటలకు పోకుండా క్లీవెజ్ షోతో కుర్రకారు మతిపొగొట్టే ప్రియాంక అందాల ప్రదర్శనలో లేటెస్ట్ ట్రెండ్‌ని సెట్ చేయడంలో తనకు తానే సాటి. ప్రస్తుతం ప్రియాంక జపంతో బాలీవుడ్,హాలీవుడ్ మార్మోగిపోతుంది. భారత్ తరపున అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది ఈ శృంగార తార.
ఈ నేపథ్యంలో ప్రియాంక క్రేజ్‌ను క్యాచ్ చేసుకునేందుకు జీ నెట్ వర్క్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఈ నెల 19న జీ సినీ అవార్డుల వేడుక జరగనుంది. ఈ డ్యాన్స్ షోలో ప్రియాంక 5 నిమిషాల డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వనుంది. ఐదు నిమిషాల ప్రదర్శన కోసం జీ నెట్‌వర్క్ వారు రూ. 4-5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
దాదాపు రెండేళ్ల తర్వాత భారత దేశంలో ప్రియాంక డ్యాన్స్ చేయనుండటంతో ఆ ప్రదర్శన అవార్డు వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. చివరిసారిగా ఆమె ఇక్కడ 2016లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డుల వేడుకలో డ్యాన్స్ వేసింది ప్రియాంక.