బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా, నిక్ పెళ్లికి సిద్దం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. 10 సంవత్సరాల చిన్నవాడైన నిక్ ని నిశ్చితార్థం చేసుకుంటుందా అని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రియాంక గుట్టు చప్పుడు కాకుండా నిశ్చితార్థం చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. ప్రియాంక, నిక్ పెళ్లికి ఇటు ప్రియాంక ఫ్యామిలీ, అటు నిక్ ఫ్యామిలీ ఇద్దరు అంగీకరించడంతో వీళ్ల పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది.
సెప్టెంబర్ 16న వీరి పెళ్లి అమెరికాలో జరగునుందని న్యూయార్క్ మీడియా కథనాలు వెలువరిస్తోంది. మీడియా కథనాల ప్రకారం సెప్టెంబర్ 16న ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజు నిక్ 26వ పుట్టిన రోజు. పుట్టిన రోజుననే ప్రియాంకను పెళ్లి చేసుకోవడానికి నిక్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ప్రియాంక వయసు 36 ఏళ్లు.. నిక్ సెప్టెంబర్ 16వ తేదీనాటికి 26లోకి అడుగు పెడుతాడు అంటే నిక్ కి, ప్రియాంకకి 10 సంవత్సరాల తేడా ఉంది.
నిక్ తో పెళ్లి కోసం సల్మాన్ హీరోగా నటించనున్న భరత్ సినిమాను కూడా వదులుకుంది ప్రియాంక. ఇక ఆమె భారతీయ సినిమాలలో నటించడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. నిక్ తో పెళ్లి తరువాత ఆమె అక్కడే సెటిల్ అయ్యే అవకాశముందిని చెబుతున్నారు.