Priyanka:బలవంతంగా బట్టలిప్పించేశాడు!

52
- Advertisement -

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాను అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాను అని ఇప్పటికే ఆమె పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా తన కెరీర్ బిగినింగ్ లో జరిగిన కాస్టింగ్ కౌచ్ వివరాలను, అవమానాలను, అలాగే ఇతర సమస్యలను ఇప్పుడు జనాలకు తెలియచేస్తోంది. ఈ క్రమంలో ఈ గ్లోబల్ బ్యూటీ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతుంది. ప్రియాంక చోప్రా సినిమాల్లోకి వచ్చిన తొలిరోజుల్లో ఒక బాలీవుడ్ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరుని ఆమె తాజాగా మొహమాటం లేకుండా బయటపెట్టింది.

ఇంతకీ, ప్రియాంక చోప్రా ఏం చెప్పిందంటే.. ఆమె మాటల్లోనే విందాం. “నా కెరీర్ ప్రారంభంలో ఓ పెద్ద డైరెక్టర్ నాకు అవకాశం ఇచ్చాడు. ఐతే, ఆ తర్వాత సినిమా షూటింగ్ లొకేషన్ లోనే ఆ పెద్ద దర్శకుడు తనను ఘోరంగా అవమానించాడని ప్రియాంక చోప్రా చెప్పింది. అతను తన అండర్ వేర్ చూపించుమన్నాడని.. నిజమే, సన్నివేశం ప్రకారం నేను ఆ సీన్ లో ఒక్కో డ్రెస్ ని మెల్లగా విడుస్తున్నట్లు నటించాలి. కాసేపు అయ్యాక ఆ దర్శకుడు మొత్తం బట్టలిప్పేసి అండర్ వేర్ తో నిలుచో అన్నాడు,” అని ప్రియాంక తెలిపింది.

Also Read:Karan Johar:బర్త్ డే స్పెషల్

ఐతే, సెట్ లో జనం ఎక్కువమంది ఉండటంతో నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. వెంటనే ఆ దర్శకుడు, ‘హే.. ప్రియాంక చోప్రా.. నువ్వు పాంటీ, బ్రా చూపించకపోతే నీ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎందుకు వస్తారు ?, ఇక కుర్రాళ్లు నిన్ను ఎందుకు ఇష్టపడతారు ?, కుర్రాళ్ళ మెప్పు కోసం ప్రియాంక చోప్రా కసిగా చేసిందిరా అని నీకు పేరు రావాలి’ అంటూ తన చేత ఆ దర్శకుడు బలవంతంగా బట్టలిప్పించేశాడు అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

Also Read:బిచ్చగాడు 3… విజయ్ క్లారిటీ!

- Advertisement -