లైగర్ షూట్ ప్రారంభం..

24
vijay

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, చార్మీల కాంబి నేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ‘లైగర్‌: సాలా క్రాస్‌బీడ్‌’. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడగా తాజాగా పరిస్థితులు చక్కబడటంతో షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు విజయ్ దేవరకొండ. గోవాలో జరిగే నైట్ ఎఫెక్ట్‌లో చిత్రీకరించనున్న యాక్షన్ సన్నివేశాల కోసం బృందం భారీ సెట్‌ను ఏర్పాటు చేయగా బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ కూర్చుని ఉండడం అందులో కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయ్ దేవరకొండ ఈ పిక్ ను పోస్ట్ చేసి “రక్తం, చెమట,వయోలెన్స్… లైగర్ షూట్ తిరిగి ప్రారంభం” అంటూ రాసుకొచ్చాడు.