చెన్నై మేయర్‌గా దళిత మహిళ

44
mayor
- Advertisement -

పాలనలో తనదైన శైలీలో దూసుకుపోతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఓ దళిత మహిళ ఆర్‌ ప్రియదర్శినిని నియమించారు. దీంతో 29 ఏండ్ల ప్రియ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఇక చెన్నై మేయర్‌గా ఎన్నికైన మూడో మహిళగా నిలిచారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన యువ అభ్యర్థులలో ప్రియ ఒకరు. 74వ వార్డు అయిన తిరు వీకా నగర్‌ నుంచి గెలుపొందిన ప్రియా.. ఉత్తర చెన్నై నుంచి ఎంపికైన మొదటి మేయర్‌గా కూడా రికార్డ్ సృష్టించారు.

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ)లో 200 వార్డులు ఉండగా డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. అన్నాడీఎంకే 15, కాంగ్రెస్‌ 13, ఇండిపెండెట్లు 5, సీపీఎం 4, వీసీకే 4, బీజేపీ 1 స్థానం చొప్పున గెలుపొందాయి.

- Advertisement -