నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ

46
harishrao
- Advertisement -

ఆదిలాబాద్ సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించారు మంత్రి హరీష్ రావు. సీసీఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని…. పునరుద్ధరణ చేసేందుకు కేంద్రంలోని బిజెపి నేతలు మాత్రం మౌనంగా ఉన్నారు. బిజెపి నేతలు దమ్ముంటే సీసీఐ తెరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని రాయితీలు కల్పిస్తాం అన్నారు.

సీసీఐ కోసం చేస్తున్న ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీ తరుపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. రైతు వ్యతిరేకం, పేదల వ్యతిరేకం, ఉద్యోగుల వ్యతిరేకం, సాధారణ ప్రజల వ్యతిరేకం.. ఇలా అన్ని రకాల వర్గాలకు బిజెపి పాలన వ్యతిరేకం అన్నారు.ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేత‌లు దొంగ జ‌పం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్న‌రు. అస‌లు ఉద్యోగాలు ఇచ్చింది ఎవ‌రు..? ఇవ్వంది ఎవరు..?నోటిఫికేష‌న్లు ఇచ్చింది ఎవ‌రు.. నోటిఫికేష‌న్లు ఇవ్వనిది ఎవ‌రు..? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా..?బండి సంజ‌య్ అండ్ బ్యాచ్ ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాలి.. గాలి మాట‌లు కాదు..ఉద్యోగాలు ఇస్తే గ‌ణాంకాలు చెప్పాలి.. మీ బిజెపి హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.

నోటికి వ‌చ్చిన‌ట్లు, ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు అవుతుందా.. నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ట్లు అవుతుందా..బీజేపీ పాల‌న‌లో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ ప‌డుతుందో బండి సంజ‌య్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత నియామ‌కాలకు తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. మ‌రో 50 నుంచి 60వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు క‌స‌రత్తు చేస్తుందన్నారు. బిజేపీ నాయకులకు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు.. నోటిఫికేషన్ల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది….బిజెపి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. నిరుద్యోగ భారత్ గా చేస్తున్నది..ఈ విషయాన్ని ప్రముఖ విశ్లేషణ సంస్థలు వెల్లడిస్తున్నాయన్నారు.

- Advertisement -