మెగా హీరోకు నో చెప్పిన ప్రియా వారియర్..!

235
Priya Prakash Varrier
- Advertisement -

సోషల్ మీడియా వల్ల ఓవర్నైట్‌లో స్టార్‌గా మారిపోయింది మలయాళం ముద్దుగుమ్మ ప్రియా వారియర్. ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాలోని ఒక పాటలో కన్నుగీటేసిన ప్రియా కుర్రకారు మతులు పోగెట్టేసింది. ఈ ఒక్క పాటతోనే ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. దాంతో వివిధ భాషల నుంచి ఆమెకు అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా కోసం కూడా ప్రియా వారియర్‌ను సంప్రదించారట.

Kalyan Dev

ఇక కల్యాణ్ దేవ్ హీరోగా విజేత అనే సినిమా వచ్చిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో నెక్స్‌ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతుండగా, ఈ సినిమా కోసం ప్రియా వారియర్‌ను అడిగితే, పారితోషికంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. స్టార్ హీరోలతో మాత్రమే చేయాలనే ఉద్దేశంతో ప్రియా వారియర్ ఉందట. అందువల్లనే కొత్తగా వస్తోన్న హీరోల సరసన చేయనని చెప్పకుండా, పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తుందని సమచారం.

- Advertisement -