కన్ను గీటి కుర్రకారు గుండెళ్లో వీణ మీటింది మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. గత ఏడాది మలయాళంలో వచ్చిన `ఒరు ఆడార్ లవ్` చిత్రంలోని ఓ సన్నివేశంలో కన్నుగీటడం ద్వారా రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయింది ప్రియా వారియర్. ఒక పక్క హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటేనే.. తనలోని మరో కోణాన్ని బయట పెట్టింది. తాజాగా మలయాళంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా కోసం ఈ బ్యూటీ పాట పాడింది.
నరేశ్ అయ్యర్‌తో కలిసి ఈమె పాట పాడింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. చాలా బాగా పాడావంటూ నెటిజన్స్ ప్రియా ప్రకాశ్‌ను అభినందిస్తున్నారు. `తన తొలి ప్రయత్నానికి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు` అని మెసేజ్ ద్వారా అందరికీ ప్రియా ప్రకాశ్ థాంక్స్ చెప్పింది.
ఇక ప్రియా వారియర్ టాలీవుడ్లో సినిమా చేస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రంగ్‌దే’లో ఆమె నటించబోతున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి ప్రియా వారియర్ కూడా హాజరయ్యారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మరోపక్క ప్రియా వారియర్ నటించిన బాలీవుడ్ సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ విడుదలకు సిద్ధమౌతోంది.