2 వేల నోట్ల ముద్రణపై కేంద్రం వివరణ..

288
2000 notes

రూ. 2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపేస్తారని వస్తున్న ప్రచారంపై కేంద్రం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీనిపై లోక్‌సభలో స్పందించింది. రూ .2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్ల ముద్రణను నిలిపివేయడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం లోక్‌సభకు తెలియజేసింది. ఈ అంశంపై లోక్ సభలో ఓ ప్రశ్నకు బదులుగా ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

2 వేల నోటు ముద్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఆర్బీఐని సంప్రదించి కేంద్రం సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా నోట్ల ముద్రణ తాత్కాలికంగా నిలిచి పోయినట్టు ఆర్బీఐ తెలిపిందని చెప్పారు. అయితే కేంద్ర, రాష్ట ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణం నోట్ల ముద్రణ మళ్లీ ప్రారంభమైందని తెలిపారు.