నాకు పోటీ ఇతడే: సోనూ సూద్

181
Sonu Sood

బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. అందుకు కారణం ఆయన మంచి మనసే. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు సోనూ సూద్ చేసిన కృషి సామాన్యమైంది కాదు. బస్సుల నుంచి విమానాల వరకు ఖర్చుకు వెరవకుండా ఏర్పాటు చేసి వలస కార్మికుల ముఖాల్లో వెలుగు నింపాడు. అప్పటినుంచి సోనూ సూద్ పేరు మార్మోగిపోతోంది.

కాగా సోనూసూద్‌ కుమారుడు ఇషాన్‌ సూద్‌ బర్త్‌డే నేడు (సెప్టెంబర్‌ 19). ఈ సందర్భంగా సోనూసూద్‌ తన కుమారుడికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ పోస్ట్ చేశారు. ”నా హీరో ఇషాన్ సూద్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఫైనల్‌గా నాకు ఫిట్‌నెస్ విషయంలో పోటీ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు.” అని తెలుపుతూ.. సేమ్‌ టు సేమ్‌ డ్రస్సు వేసుకుని బాడీని ఎక్స్‌పోజ్ చేస్తున్న పిక్‌ను సోనూ పోస్ట్ చేశారు. ఇషాన్ చిన్నప్పటి ఫొటో ఇది. ఈ పిక్‌కు మంచి స్పందన లభిస్తోంది.