నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత శాంతి భద్రతల పరంగా తొలి అతిపెద్ద సవాలు రేపు ఎదురుకానుంది. ఈ నేపథ్యంలోనే విశ్వాసం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడే హక్కు ఎవరికీ లేదని వివాదస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మద్దతుదారులను ఉద్దేశించ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
అలాగే దేశమంతా పండుగ ఉత్సవాలను జరపుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు సహజంగా ఆందోళన కలిగిస్తాయని మన్ కి బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించారు.
నమ్మకం పేరుతో హింసను ప్రేరేపించడం మంచిది కాదని, విశ్వాసం అనేది రాజకీయ, వ్యక్తిగత, మతపరమైన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. రాజ్యాంగం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని, అందరూ చట్టానికి లోబడి ఉండాలని ప్రధాని కోరారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసాత్మకఘటనలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అత్యాచారం, హత్య కేసులో డేరా సచ్ఛా సౌధ చీఫ్, వివాదస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా పేర్కొంటూ గత శుక్రవారం పంచకుల సీబీఐ న్యాయస్థానం ప్రకటించింది.
దీంతో ఆయన మద్దతుదారులు దాడులకు పాల్పడటంతో పంచకులలో 30 మంది, సిర్సాలో 6 గురు ప్రాణాలు కోల్పోగా, అనేక వందల మంది గాయపడ్డారు. హరియాణా, పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు కొన్ని ప్రాంతాల్లో కనబడితే కాల్చివేత ఉత్తర్వులను అమలు చేస్తున్నారు.