ధ్యానమందిరాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాద్

405
president kovind
- Advertisement -

రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేగూరు వద్ద నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు ప్రారంభించారు. దాదాపు 14 వందల ఎకరాల్లో లక్షమంది ధ్యానం చేసే విదంగా నిర్మించిన కన్హా ఆశ్రమాన్ని రాష్ట్రపతి కోవింద్ నేడు ప్రారంభించారు. శ్రీమతి సవితా కోవింద్, తెలంగాణ, హిమాచల్ రాస్ట్రాల గవర్నర్లు తమిళ సై సౌందరరాజన్, దత్తాత్రేయ లతో కలసి కన్హా ఆశ్రమానికి చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ కు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ అమయి కుమార్ , పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తదితరులు స్వాగతం పలికారు.

ధ్యాన మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ, వసుదైవ కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అనే విశ్వ మానవ సిద్ధాంతాన్ని అందించిన భారతీయ తత్వాన్ని ప్రపంచo లో వ్యాప్తి చేసేందుకు శ్రీరామ చంద్ర మిషన్ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రశంసించారు. దాదాపు 150 దేశాలలో ధ్యానం ద్వారా మానవ జీవితాల్లో పరివర్తన తెస్తున్న రామ చంద్ర మిషన్ తో తనకు మూడు దశాబ్దాలుగా అనుబంధం ఉందని కోవింద్ గుర్తు చేశారు. ధ్యాన మార్గం ద్వారానే వ్యక్తిగత పరివర్తన తద్వారా సమాజ పరివర్తన సాధ్యమవుతుందని రాష్ట్రపతి అన్నారు. ఆందోళనకర పరిస్థితులు,అనిశ్చితి, అభద్రతాభావo శత్రుత్వ స్వభావం తో కూడిన ప్రస్తుత ప్రపంచంలో శ్రీ రామ్ చంద్ర మిషన్ వంటి సంస్థల బాధ్యత మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. బాధాతత్ప సమాజానికి ఉపశమన సేవలను రామ చంద్ర మిషన్ లాంటి సంస్థలు మాత్రమే ఇవ్వడం లో కీలకపాత్ర వహిస్తాయని పేర్కొన్నారు .

మానవ సమాజాన్ని సరైన దిశలో నడిపించడానికి యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేస్తూ మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేoదుకు నిమగ్నం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. శ్రీ రామ్ చంద్ర మిషన్ యొక్క విశ్వ సమాజం రుజు మార్గం తో కూడిన శక్తి, ఆనందమయం తో నిండిన ఈ ప్రపంచాన్ని మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామచంద్ర మిషన్ అధ్యక్షులు దాజి కమలేష్ పటేల్ మాట్లాడుతూ, పటిష్టమైన ఆధ్యాత్మిక భావన ద్వారా ప్రపంచానికి భారతదేశం మార్గదర్శకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్, గవర్నర్లు తమిళ సై సౌందరరాజన్, దత్తాత్రేయ లను కమలేష్ పటేల్ ఘనంగా సన్మానించారు. అనంతరం కన్హా ఆశ్రమంలో రాష్ట్రపతి మొక్కలు నాటారు.

- Advertisement -