తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు నేటి తో ముగియనున్నాయి.తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.బేగంపేట విమానాశ్రయంలో కోవింద్‌కు గవర్నర్ నరసింహన్,సీఎం కేసీఆర్,మంత్రులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి రాజ్ భవన్‌కు చేరుకోనున్న కోవింద్…. సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్ నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకొని ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రి 7.15 గంటల వరకు ఎల్బీస్టేడియంలోనే ఉంటారు. తిరిగి 7.25 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.
బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు పలువురిని కలుస్తారు. ఉదయం 10 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ద విగ్రహం వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి 11.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు రాష్ట్రపతిభవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలమేరకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ఖరారుచేసింది.