‘కడప’ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్..

186
RGV's Kadapa Title Song with Lyrics
- Advertisement -

రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంట్రవర్శికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తాడు. వర్మ ఏది చేసినా అది సంచలనమే. అయితే రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలను ఎనౌన్స్ చేస్తూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాడు. వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. వర్మ తీస్తున్న తొలి అంతర్జాతీయ తెలుగు వెబ్‌ సిరీస్‌ ఇది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌తో కడపలో జరిగే ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మ ఇప్పుడు సినిమా టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

RGV's Kadapa Title Song with Lyrics

‘అది కడపా.. యమ ద్వారపు గడపా..’ అంటూ సాగే ఈ పాటలో ట్రైలర్‌లో చూపించిన హత్యలను మరోసారి చూపించారు. ఈ సిరీస్‌ గురించి వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ ఇందులో నూటికి నూరు శాతం నిజాలనే చూపిస్తానని వర్మ వెల్లడించారు. ఇందులో నటీనటులను కొత్త వాళ్లనే తీసుకున్నారు వర్మ. ఎన్‌అండ్‌ఎన్‌ క్రియేషన్స్‌, ఏ కంపెనీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి.

వర్మ ఈ సిరీస్‌తో పాటు అక్కినేని నాగార్జునతో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. మరోపక్క అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అనే బయోపిక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు వర్మ.

- Advertisement -