ఈ సిగరెట్లపై నిషేధం..రాష్ట్రపతి అమోదముద్ర

626
e cigarette
- Advertisement -

ఢిల్లీ: ఈ సిగరెట్లపై నిషేధానికి అమోదముద్ర వేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ సిగరెట్‌ల ఉత్పాదన, పంపిణీ, నిల్వచేయడం చట్టరీత్యా నేరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు రాష్ట్రపతి. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది రాష్ట్రపతి భవన్.

ఈ సిగరెట్ అంటే సిగరెట్ లేదా పెన్నులాగా ఉండే ఎలక్ట్రానిక్ పరికరం. వీటిలో పొగాకు ఉండదు. రకరకాల ఫ్లేవర్లతో కూడిన నికోటిన్ ద్రావకం, ఇతర రసాయనాలు ఉంటాయి. వీటిలో ఉండే రసాయనాలు హానికరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ-సిగరెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అందులోని నికోటిన్ ద్రావకం పొగలాగా మారి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సిగరెట్ తాగిన అనుభూతినిస్తుంది.

ఈ నేపథ్యంలో అసలు సిగరెట్ అలవాటు లేని యువత ఈ-సిగరెట్లవైపు ఆకర్షితులవుతున్నారు. పెన్నులాగా ఉంటే ఈ పరికరాన్ని నాలుగు గంటలు చార్జీంగ్ పెడితే ఏకంగా గంట పాటు పొగపీల్చవచ్చు. 20 సిగరెట్లలో ఎంత నికోటిన్ ఉంటుందో, ఇ-సిగరెట్ ఒక్క కేట్రిడ్జ్‌లో అంతే పరిమాణంలో నికోటిన్ ఉంటుంది. దేశంలో 460 ఈ-సిగరెట్ బ్రాండ్లు 7,700 ఫ్లేవర్స్‌లో లభిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సిగరెట్లపై కేంద్రం బ్యాన్ విధించింది.

అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, థాయ్‌లాండ్ సహా 31 దేశాలు ఈసిగరెట్లపై నిషేధం విధించాయి. అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం వీటిపై నిషేధం విధించింది.

Electronic cigarettes, also known as e-cigarettes, e-vaporizers, or electronic nicotine delivery systems, are battery-operated devices that people use to inhale an aerosol

- Advertisement -