హైదరాబాద్‌కు రాష్ట్రపతి

76
- Advertisement -

శీతాకాల విడిదికోసం ఈ నెల 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ రానున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు బస చేయనుండగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో చుట్టూ ఉన్న ప్రాంతాలను, ఉద్యానవనాలను అందంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు.

తన పర్యటనలో భాగంగా ఈ నెల 27న కేశవ్ మెమోరియల్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి.అలాగే సర్దార్ వల్లాభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ 74th RR బ్యాచ్‌నుద్దేశించి మాట్లాడనున్నారు.

ఇక డిసెంబర్ 28న భద్రాచాలంలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆసీఫాబాద్ కొమురంభీం జిల్లాలో పర్యటించనున్నారు. అలాగే రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు.

29న జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌( మహిళలు) విద్యార్థినులతో మాట్లాడనున్నారు. అదేవిధంగా శంషాబాద్ సమతా విగ్రహాన్ని సందర్శించనున్నారు. 30న వీఐపీల కోసం తేనేటీ విందు ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -