మేకను రేప్ చేసిన కామాంధులు…

225
Pregnant goat dies after being gangraped by 8 men in Haryana
- Advertisement -

దేశంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. చిన్న పిల్లలను సైతం వదలడం లేదు కామాంధులు. ఇక తాజాగా మహిళలనే కాదు.. నోరు లేని జంతువులను సైతం వదలడం లేదు. 8 మంది కామాంధుల ఆకృత్యానికి ఓ మేక బలైపోయింది. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్న ఈ ఘటన హర్యానాలోని మేవాట్ జిల్లాలో మరోడా అనే గ్రామంలో జరిగింది.

Pregnant goat dies after being gangraped by 8 men in Haryana

అస్లప్ ఖాన్ అనే వ్యక్తి మేక బుధవారం రాత్రి కనిపించకుండా పోయింది. మేక కనిపించకపోవడంతో తనతో పాటు, ఇరుగుపొరుగు వారు కూడా మేకను వెతకడానికి వెళ్లారు. ఓ చోట మేక అరుపులు విన్న అస్లుప్ ఖాన్.. అక్కడికి వెళ్లిచూడగా కొందరు వ్యక్తులు మేకపై లైంగిక దాడి చేస్తున్నారు. మొత్తం 8 మంది ఈ అఘాయిత్యానికి పాల్పడగా.. ముగ్గురుని స్థానికుల సహాయంతో చితబాదాడు అస్లుప్, అనంతరం ఈ ముగ్గురు కూడా పరారయ్యారు.

మేకను ఆస్పత్రికి తీసుకెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. మరుసటి రోజు ఆ మేక చనిపోయింది. నిందితులపై అస్లప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గర్భం దాల్చిన మేకపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐపీసీ సెక్షన్ 377, యానిమల్ క్రూయల్టీ చట్టాల కింది నిందితులపై కేసు నమోదు చేశామని. ఈ ముఠాపై గతంలోనూ పలుకేసులు నమోదు అయ్యాయని, జైలుకు కూడా వెళ్లొచ్చారని ఎస్పీ నజ్నీన్ భాసిన్ తెలిపారు. నిందితులు కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

- Advertisement -