అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

228
Kcr at mahankali bonalu

సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. . ఉదయం నుంచే వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. ఈసందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పండితులు, మంత్రులు, అధికారులు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు సంతోష్ కుమార్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

cmkcr ujjainimahankali

తెల్లవారుజామునే మహా మంగళ హరతితో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.బంగారు కిరీటం, వజ్రాల ముక్కుపుడక,బొట్టుతో అలంకరించారు. కాసుల దండ, మంగళ సూత్రాలతో దివ్యమంగళ స్వరూపంగా అమ్మవారు భక్తుల దర్శనం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం సమర్పించారు..ఇక జాతరలో ప్రధాన ఘట్టంగా రంగం వైభవంగా జరగనుంది.

ఉదయం ఎంపీ కవిత కూడా అమ్మవారిని దర్శించుకుని బంగారు బోనం సమర్పించారు. స్వయంగా ఎంపీ కవిత నెత్తిన అమ్మవారి బంగారు బోనం ఎత్తుకుని ఆదయ్య నగర్‌ నుండి, సిటీ లైట్‌ హోటల్‌, ఆర్మీ రోడ్డు, సుభాష్‌ రోడ్డు మీదుగా మహంకాళి టెంపుల్‌ వద్దకు చేరుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.