ప్రతిపక్షాలకు చుక్కలు చూపించిన..

30
- Advertisement -

దేశంలో నెంబర్‌ వన్‌గా ఉన్నా తెలంగాణ ప్రగతి రాష్ట్ర ప్రతిపక్ష నాయకులకు కనబడటం లేదని మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ వేదికగా విమర్శించారు. నిస్సారమైన మాటలు తప్ప ఏం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పులు తగ్గించుకుంటే కేంద్రం మాత్రం వీపరీతంగా అప్పులు పెంచుకుంటూ పోతుందన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ… అప్పులు ఇన్ని ల‌క్ష‌ల కోట్లు పెంచార‌ని విప‌క్ష స‌భ్యులు అంటున్నారు. మ‌రి జీఎస్‌డీపీ ఎన్ని ల‌క్ష‌ల కోట్లు పెరిగిందో కూడా చెప్పాలి క‌దా? అని హ‌రీశ్‌రావు అడిగారు. రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌డు జీఎస్‌డీపీ నాలుగున్న‌ర ల‌క్ష‌ల కోట్లు ఉంటే.. ఇప్పుడు ప‌ద‌మూడున్న‌ర ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌న్నారు. పెరిగిన ఆస్తి గురించి కూడా ఆలోచించాలి.

అప్పుల విష‌యంలో 24.3 నుంచి 23.8 శాతానికి త‌గ్గించామ‌న్నారు. ఇది ఆర్థిక ప‌రిపుష్టికి నిద‌ర్శ‌నం అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ దేశ ప్ర‌జ‌ల‌పై నెల‌కు ల‌క్ష కోట్ల అప్పు మోపుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఒక రోజుకు వీరు తీసుకునే అప్పు రూ. 4,618 కోట్లు. గంట‌కు తీసుకునే అప్పు రూ. 192 కోట్లు. నెల‌కు వీరు క‌ట్టే వ‌డ్డీ.. రూ. 2,959 కోట్లు. వీళ్లా అప్పుల విష‌యంలో మాకు నీతులు చెప్పేది అని హ‌రీశ్‌రావు దుయ్య‌బ‌ట్టారు.

మిషన్‌ భగీరథలో 1.50లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్‌, 37వేల వాటర్‌ ట్యాంక్‌లు, 1804 సర్వీస్‌ రిజర్వాయర్‌లు, 123 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ పాంట్లు, 77 ఇంటెక్‌ వెల్స్‌ వీటన్నింటిని నాలుగేళ్లలో పూర్తి చేయడం ఓ భగీరథ యత్నం. ఇది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి మిగతా పార్టీలకు ఉన్న తేడా అన్నారు. న్యూ ఉస్మానియా బిల్డింగ్ నిర్మించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. యునాని హాస్పిట‌ల్‌ను కూడా అభివృద్ధి చేస్తాం అని ప్ర‌క‌టించారు.

ప‌న్నులు వేసే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేదు. ఎలాంటి కొత్త ప‌న్నులు వేయబోమని మంత్రి స్పష్టం చేశారు. సొంత ఆదాయ వ‌న‌రుల‌పై దృష్టి సారించాం అని అన్నారు. ఇందిరా పార్క్ వ‌ద్ద పారిశ్రామిక‌వేత్త‌లు ఎందుకు ధ‌ర్నాలు చేయాల్సి వ‌చ్చింద‌ని హ‌రీశ్‌రావు భ‌ట్టిని అడిగారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి కృష్ణా జ‌లాల‌ను తీసుకొస్తే.. ఇదే స‌భ‌లో దివంగ‌త ఎమ్మెల్యే పీజేఆర్ ఎందుకు నీళ్ల గురించి ప్ర‌శ్నించిన నాటి విష‌యాన్ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

కాంగ్రెస్‌లోనే కరెంట్‌ సమస్యలు లేకపోతే..పవర్ హాలిడేలు క్రాప్ హాలిడేలు ప్రకటించారని మండిపడ్డారు. రెండు, మూడు నెల‌ల క్రితం డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఎరువులు దొరక్క తొక్కిస‌లాట జ‌రిగి ఆరుగురు రైతులు మ‌ర‌ణించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొర‌త లేదు. అన్ని మండ‌లాల్లో గోడౌన్లు క‌ట్టి.. బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచి రైతుల‌కు ఎరువులు అందిస్తున్నామని అన్నారు. ప్ర‌భుత్వం యొక్క ముందు చూపుతో, సీఎం కేసీఆర్ దార్శ‌నిక‌త‌ వ‌ల్ల రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది లేదు అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

దేశ జీడీపీని మంటగలిపారన్నారు. బీజేపీ హయాంలో ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, మతపిచ్చి మంటలు రేపడంలో బీజేపీ ప్ర‌భుత్వం స‌క్సెస్ అయింద‌ని హ‌రీశ్‌రావు చుర‌క‌లంటించారు. విపరీతంగా సెస్సులు వేయడం, సిలిండర్‌ ధరలు పెంచుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పసిపిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధంచిన ఘనత బీజేపీకే సాధ్యమైందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఇవి కూడా చదవండి…

అమిత్‌ షాకు కోటంరెడ్డి ఫిర్యాదు..

రేవంత్ పాదయాత్ర.. కాంగ్రెస్ ను గట్టెక్కిస్తుందా?

నిరంతర ప్రయత్నంతోనే సక్సెస్

- Advertisement -