పీకే గుప్పిట్లో జగన్, చంద్రబాబు?

31
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఉన్న ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇదిలా ఉంచితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి పికే వ్యూహాలు కూడా వైసీపీకి ఎంతో కొంత మేలు చేశాయి. ఇక 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ రెండోసారి అధికారంలోకి రావాలని తెగ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఐప్యాక్ టీం రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా సర్వేలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఈసారి కూడా ప్రశాంత్ కిషోర్ సేవలను గట్టిగానే ఉపయోగించుకునేందుకు జగన్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పీకే ఇటీవల భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అసలు పీకే చంద్రబాబుతో భేటీ కావడం ఎంటనే చర్చ జోరందుకుంది. గతంలో పీకే పై నిప్పులు చెరిగిన బాబే ఇప్పుడు సమావేశం కావడంతో ఆయనను ఎన్నికల వ్యూహకర్తగా వినియోగించుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే గతంలో వైసీపీ విజయంలో కీలకంగా వ్యవహరించిన పికే ఇప్పుడు ఆ పార్టీకి దూరమైనట్లేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే చంద్రబాబుతో మర్యాదపూర్వకంగానే కలిశానని పికే ఇటీవల చెప్పుకొచ్చారు. అయినప్పటికి రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. అటు జగన్ గాని, ఇటు చంద్రబాబు గాని ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చుట్టూ తిరుగుతుండడంతో చివరికి ఆయన ఎవరి పక్షాన ఉండబోతున్నారనేది ఆసక్తికరంగా మారిన అంశం.

Also Read:తెలంగాణ అంటేనే బీఆర్ఎస్:ఎంపీ రంజిత్

- Advertisement -