జేడీయూ నుంచి ప్రశాంత్ కిశోర్ బహిష్కరణ..

322
prashanth kishor
- Advertisement -

జేడీయూ నుంచి ప్రశాంత్ కిశోర్‌ని బహిష్కరించింది ఆ పార్టీ. ప్రస్తుతం జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్‌కి ఆ పార్టీ నేతలకు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. దీనికి తోడు సీఏఏ విషయంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగానే స్టేట్ మెంట్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఈ విషయంలో నితీష్‌కు ప్రశాంత్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. బీహార్‌లో త్వరలో ఎన్నికలు జరగనుండగా జేడీయూ-బీజేపీ మిత్రపక్షంగా ఉన్నాయి.

పొలిటికల్ ఎనలిస్టుగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ కిశోర్. ప్రధానమంత్రిగా మోడీ ఎంపికవడం దగ్గరి నుంచి ఇటీవల ఏపీలో జగన్ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్‌ సీఎం ,తమిళనాడులో కమల్,ఢిల్లీలో ఆప్ తరపున పనిచేస్తున్నారు.

ఇక బీహార్‌లో జేడీయూ సర్కార్ ఏర్పడటంలో కీ రోల్ పోషించారు ప్రశాంత్ కిశోర్. ఈ నేపథ్యంలో ఆయన్ని జేడీయూ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే అనతికాలంలోనే ఆయన్ని అదే నితీశ్ పార్టీ నుంచి బహిష్కరించారు.

- Advertisement -