అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తు దొరికిపోయిన ఎమ్మెల్సీ..!

180
congress mlc
- Advertisement -

సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు ఆ ప్రజాప్రతినిధి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కర్ణాటక అసెంబ్లీలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారం ప్రారంభం కాగా.. తొలిరోజు ప్రభుత్వం 11 బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టింది. వీటిపై రెండో రోజు శుక్రవారం అసెంబ్లీ, మండలిలో కీలక చర్చ ప్రారంభమైంది. అయితే బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ పోర్న్‌ వీడియో చూస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు.

దీనిపై తీవ్రంగా విమర్శలు రాగా స్పందించారు ప్రకాశ్‌ రాథోడ్. తన మొబైల్‌ ఫోన్‌లో మెమొరీ నిండిపోగా.. అనవసరంగా స్టోరైన వీడియోలను డిలీట్‌ చేశానే తప్పా.. వీడియోలు చూడలేదని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై అధికార పార్టీ బీజేపీ సైతం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

- Advertisement -