రివ్యూ: 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?

366
30 rojullo preminchadam ela

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకుడు. ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా నీలి నీలి ఆకాశం సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో ప్రదీప్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…

కథ:

పునర్జన్మ ప్రధానాంశంగా తెరకెక్కిన కథ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?. బ్రిటీష్ కాలం నాటి పల్లెటూరి ప్రేమకథలో అమ్మాయి గారు (అమృతా అయ్యర్).. అబ్బాయిగారు (ప్రదీప్) ప్రేమికులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కుస్తీ అంటే ప్రదీప్‌కు ప్రాణం.. ఈ నేపథ్యంలో తనకంటే కుస్తీనే ఎక్కువ అని ప్రదీప్ చెప్పడంతో ఆత్మహత్య చేసుకుంటుంది అమృతా. దీంతో తాను చచ్చిపోతాడు ప్రదీప్. సీన్ కట్ చేస్తే.. గత జన్మలో చనిపోయిన వీరిద్దరూ ఎలా కలిశారు..??వీరిని గత జన్మ తాలుకా జ్ఞాపకాలు ఎలా వెంటాడాయి? చివరికి కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నీలి నీలి ఆశాశం సాంగ్,ప్రదీప్ నటన. హీరోగా ప్రదీప్‌కి మొదటి చిత్రమే అయినా తన నటనతో ఆకట్టుకున్నారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ హీరోయిన్ అమృతా అయ్య‌ర్. అమ్మాయిగారుగా .. అక్షరగా ఇరగదీసింది. ప్రదీప్‌కి ఫ్రెండ్‌గా చేసిన హర్ష, భద్రంలు నవ్వులు పూయించారు. ప్రదీప్‌కి తల్లిగా హేమ , హీరోయిన్ తండ్రిగా పోసాని క్రిష్ణమురళి తన వైవిధ్యమైన నటనతో ఆకట్టకున్నారు. ప్రదీప్ కాంబినేషన్ సీన్లలో నవ్వులు పంచాడు పోసాని. శుభలేక సుధాకర్-రంగస్థలం మహేష్‌లతో ఈ సినిమా కథ ప్రారంభం కానుండగా.. స్వామిజీగా శుభలేక సుధాకర్.. అతని శిష్యుడిగా రంగస్థలం మహేష్ ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

సీరియస్ నోట్‌తో కథ మొదలుపెట్టినా.. బ్రిటీష్ కాలం నాటి కథ.. కుస్తీలో 90 రూపాయల కోసం ప్రేయసి వద్దను కోవడం.. అప్పుడే అమ్మాయిగారి పెళ్లి.. వెంటనే అబ్బాయిగారు కూడా చనిపోవడం.. ఇదంతా కన్వెన్సింగ్‌గా అనిపించదు. పునర్జన్మల నేపథ్యంలో కథను బాగానే రాసుకున్న.. కన్వెన్సింగ్‌గా బ్యాలెన్స్ చేయలేకపోయాడు దర్శకుడు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. ఈ సినిమాకి మేజర్ హైలైట్ సంగీతం.. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నీలి నీలి ఆకాశం పాటతో పాటు.. ఇదేరా స్నేహం, మీకో దండం సాంగ్స్ ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

పునర్జన్మ,లవ్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?. పాటలు,సెంటిమెంట్,హీరో,హీరోయిన్ల నటన సినిమాకు ప్లస్ కాగా కథ మైనస్ పాయింట్‌. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?.

విడుదల తేదీ: 29/01/2021
రేటింగ్:2.5/5
30 రోజుల్లో ప్రేమించటం ఎలా?
నటులు:యాంకర్ ప్రదీప్,అమృత అయ్యర్
సంగీతం:అనూప్ రూబెన్స్
నిర్మాత: ఎస్వీ బాబు
దర్శకుడు: మున్నా