మా సభ్యత్వానికి ప్రకాశ్‌ రాజ్ రాజీనామా..

117
prakash raj
- Advertisement -

మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. మా ప్రాథమిక సభ్యత్వానికి ప్రకాశ్‌ రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడిన ప్రకాశ్‌ రాజ్..ఆత్మాభిమానం ఉన్న వాడిని గనకే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చిన వారు మా ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తామ‌ని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారని…. అలాంటి మా లో ప‌ని చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ప్ర‌కాశ్‌రాజ్ చెప్పారు. లోక‌ల్, నాన్ లోక‌ల్ అజెండా మ‌ధ్య ప‌ని చేయ‌లేను …21 ఏండ్లుగా మాతో అనుబంధం ఉంద‌న్నారు.

తెలుగుబిడ్డ‌ను, తెలుగువాడిని మా అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. గెస్ట్‌గా వ‌స్తే గెస్ట్‌గానే ఉండాల‌ని చాలా మంది చెప్పారు. ఇక నుంచి గెస్ట్‌గానే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నానని చెప్పారు. నా త‌ల్లిదండ్రులు తెలుగువారు కాదు. అది నా త‌ప్పు కాదు.. నా త‌ల్లిదండ్రుల త‌ప్పుకాదు అని ప్ర‌కాశ్ రాజ్‌ అన్నారు.

- Advertisement -