వివాదాలతో లోకువ కావొద్దు: చిరు

46
chiru

అనేక వివాదాల నడుమ మా ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్, కోశాధికారిగా శివబాలాజీ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా పెళ్లి సందడి ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. రెండు మూడు ఏళ్ళు ఉండే పదవికి కోసం ఒక్కరిని మాటలను అనడం.. అనిపించుకోవడం అవసరమా అని సూచించారు. ఇలా అనుకుంటుంటే ఎదురు వారికీ మనం ఎంత లోకువ అయిపోతాం.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా అని చిరు ప్రశ్నించారు.

ఇండస్ట్రీలో వివాదాలకు కారణం ఎవరో తెలుసుకుని వారిని ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలన్నారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దు అని చెప్పిన చిరు… వివాదాలతో లోకువ కావద్దన్నారు.