ప్రముఖ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సినిమాల్లో పూలని, పండ్లని ఎలా వాడాలో ఆయనకి మాత్రమే తెసిన విధ్య. అలా ఆయన తీసే ప్రతి సినిమాలో వాటిని వాడతారు రాఘవేంద్రరావు. అయితే ఇప్పుడు ఆయన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు అడిగి మరీ వారి బొడ్డు మీద పూలు వెయించుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కార్యక్రమం లేటెస్ట్ సిరీస్ కి హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ కు నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇందులో ‘మన్మథుడు సింగిల్ గా రావడం ఏంటి.. అమ్మాయి తోడు లేకుండా’ అని చిరంజీవి వెతుక్కుంటుంటే.. ‘మీరు అడుగుతారనే ఓం నమో వెంకటేశాయ సినిమాలో నాకు మరదలిగా నటించిన ప్రగ్యా జైస్వాల్ ను కూడా తోడు తెచ్చుకున్నా’ అంటూ ప్రగ్యాను షోలోకి తెచ్చాడు నాగార్జున.
చిరు ప్రగ్యా తో మాట్లాడుతూ.. ‘కంచెలో చూశాను.. బాగా చేశారు.. ఇప్పుడు నాగ్ తో చేయడం పై మీ ఫీలింగ్ ఏంటి? రెండింటికీ ఏంటి తేడా?’ అంటూ ఈ బ్యూటీని అడిగారు చిరు. దానికి బదులుగా ‘నేను చేసిన కంచె 75 సంవత్సరాల క్రితం స్టోరీ అయితే.. ఈ సినిమా కోసం 500 ఏళ్లు వెనక్కెళ్లాం’ అని ప్రగ్యా చెప్పింది. అలాగే నాగార్జున గురించి తెగ పొగిడేసింది కూడా. ఓం నమో వేంకటేశాయలో మొదటగా వీరిద్దరూ చేసిన రొమాంటిక్ పాటనే షూట్ చేశారని చెప్పింది ప్రగ్యా.
ఆ పాటలో ప్రగ్యా బొడ్డుపై ఫ్లవర్స్ వేసే సీన్ ఒకటి ఉంటుంది. నిజానికి ఈ సీన్ పెట్టాలని దర్శకుడు రాఘవేంద్రరావు అనుకోలేదట. కానీ ప్రగ్నానే అడిగి మరీ ఆ సీన్ పెట్టించుకుని చేసింది అని చెప్పేశాడు నాగార్జున. ఇంతలో అందుకున్న ప్రగ్యా.. ‘మొదటి రోజు షూటింగ్ అయిపోయింది.. రెండో రోజు షూటింగ్ అయిపోయింది. మూడో రోజు కూడా అయిపోతుంటే.. అప్పుడు ఇక నేనే అడిగేశాను’ అని ప్రగ్యా జైస్వాల్ చెప్పింది.
దీంతో చిరు మాట్లాడుతూ.. ‘పెయింటింగ్ వేసిన తర్వాత ఆర్టిస్ట్ సంతకం పెట్టినట్లుగా.. పాటలో హీరోయిన్ బొడ్డుపై పళ్లు..పూలు వేయడం రాఘవేంద్రరావు గారి సిగ్నేచర్. అలా వేయించుకున్న వాళ్లందరూ స్టార్ హీరోయిన్స్ అయిపోయారు కదా. అందుకే ప్రగ్యా కూడా అడిగి మరీ ఆ సెంటిమెంట్ ను ఫాలో అయుంటుంది’ అంటూ అదిరిపోయే జస్టిఫికేషన్ ఇచ్చి నవ్వులు పూయించారు చిరు. మొత్తానికి బొడ్డు మీద పూలతో కొట్టించుకోవడం అనే సీన్ ని అడిగి మరీ పెట్టించుకుంది ప్రగ్యా జైస్వాల్. మరి ఆ సెంటిమెంట్ ప్రకారం స్టార్ హీరోయిన్ గా ప్రగ్నా ఎదుగుతుందో లేదో చూడాలి.