పిక్ టాక్ : బికినీతో కుదిపేసింది

12
- Advertisement -

హాట్ భామ ప్రగ్యా జైస్వాల్ ‘కంచె’ చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ప్రగ్యా జైస్వాల్ యువత హృదయాల్లో కొలువైపోయింది. అప్పట్లో కొన్నాళ్ళు పాటు సౌత్ లో యువతకు కలల రాణిగా ఓ వెలుగు వెలిగింది ప్రగ్యా జైస్వాల్. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ప్రగ్యా జైస్వాల్ తీసుకున్న నిర్ణయాలే ఆమె కెరీర్ ముగిసేలా చేశాయి. దీనికితోడు, బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో ప్రగ్యా జైస్వాల్ కి చుక్కెదురు తప్పలేదు. దీంతో మొత్తానికి ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ట్రాక్ తప్పింది.

అలాగే, లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు కూడా ప్రగ్యా జైస్వాల్ ని కుంగదీశాయి. ఆ మధ్య బాడీ అవుట్ ఆఫ్ షేప్ గా కూడా మారింది. ఐతే, గత ఏడాది నుంచి ప్రగ్యా జైస్వాల్ మళ్లీ పర్ఫెక్ట్ ఫిజిక్ తో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయినా, ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు. అఖండ లాంటి అద్భుతమైన హిట్ వచ్చినా .. ప్రగ్యా జైస్వాల్ కెరీర్ కి ఆ సినిమా ఎలాంటి బూస్టప్ ఇవ్వలేకపోయింది. బాలయ్య కూడా ప్రగ్యా జైస్వాల్ కి మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో, గత కొన్ని నెలలుగా ప్రగ్యా జైస్వాల్ ఖాళీగానే ఉంటుంది.

ఐతే, సినిమాలు లేకపాయినా, ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం తన వెకేషన్స్ తో సంతోషంగా గడుపుతోంది. పైగా వరుసగా ఫోటో షూట్ లు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రగ్యా జైస్వాల్ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. బోల్డ్ గా ఉన్న ఈ పిక్ చూసి అంతా షాక్ కి గురవుతున్నారు. ఏకంగా బ్లాక్ కలర్ బికినీలో ప్రగ్యా జైస్వాల్ రెచ్చిపోయింది. ముఖ్యంగా ఈ ఫొటోలో ప్రగ్యా జైస్వాల్ బికినీలో కనిపిస్తూ కుర్రకారుకి హీట్ పెంచుతుంది. మరి ప్రగ్యా జైస్వాల్ కొత్తగా వదిలిన ఈ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -