పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కటౌట్ కి పోలీస్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సూటవుతుంది. ఇప్పటికే ప్రభాస్ పోలీస్ గెటప్ లో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఇంటర్నెట్ లో కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇంత వరకూ ఏ దర్శకుడు ప్రభాస్ ను పోలీస్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ గా నటించే సినిమా లాక్ అయింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నాడు. టీ సిరీస్ సంస్థ పై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నాడు.
తాజాగా చిత్ర నిర్మాత భూషణ్ ప్రభాస్ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ కేరెక్టర్ ప్లాన్ చేయనున్నాడని , డిఫరెంట్ పోలీస్ గా కనిపిస్తాడని తెలియజేశాడు. ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని తెలిపాడు ప్రభాస్ ను పోలీస్ గా ఎప్పుడెప్పుడు చూద్దామా ? అంటూ వెయిట్ చేస్తున్న రెబెల్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలతో పాటు మారుతి తో సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు.
సందీప్ రెడ్డి కూడా యానిమాల్ అనే హిందీ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఇద్దరు ఫ్రీ అవ్వగానే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్తోంది. మరి సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ ను ఉండర్ కవర్ పోలీస్ గా చూపిస్తాడా ? లేదా పూర్తిగా పోలీస్ గెటప్ లోనే చూపిస్తాడా ? తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..