పూజా హెగ్డే అందాల ఆరబోతను చూసిన యూత్ పూజా అందాలకు ఫిదా అయిపోయిన విషయం వేరే చెప్పనక్కర్లేదు. ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో ఈ సుందరికి వరుస అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఖాయమని అనుకున్నారంతా.
కానీ..హెగ్డేకి అవకాశాలు అంతంతమాత్రంగానే వున్నాయి. రంగస్థలం సినిమాలో ఓ పాటకు చిందులేసే ఛాన్సును కొట్టేసిన పూజా హెగ్డే.. తాజాగా బాహుబలి సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుందని సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కృష్ణంరాజు నిర్మాణంలో .. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఫిక్స్ చెసేందుకు సన్నాహాలు జరుగుతొన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పూజాను సంప్రదించే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయట. ఇక ప్రభాస్ పక్కన నటించడమంటే ఎవరు కాదంటారు..? అందుకే ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని జోరుగానే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా మహేశ్ బాబు 25వ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయనున్న సినిమాలోను పూజా హెగ్డేనే ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు.