ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటుంది. దర్శకుడు మారుతితో సినిమా చేయడం అంటే.. నేషనల్ స్టార్ గా ప్రభాస్ తనకున్న ఇమేజ్ ను రిస్క్ లో పెట్టడమే. నో డౌట్.. మారుతి మంచి దర్శకుడే. పైగా మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. కానీ, మారుతి కి పరిధులు ఉన్నాయి. లోకల్ కంటెంట్ కు అలవాటు పడ్డ మారుతి.. ఉన్నట్టు ఉండి నేషనల్ వైడ్ గా అలరించాలంటే.. కష్టమే.
డిసెంబరు ఫస్ట్ వీక్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ కాబోతున్నాడు. అంతే కాదు.. ఈ సినిమాని 2023 దసరా లో విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రభాస్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడట. కానీ, సాధ్యం అవుతుందా ?, అవ్వాలి అంటే.. ఆగస్టు లోపే ప్రభాస్ షూటింగ్ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది.
పైగా, ఆగస్టు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సెప్టెంబర్ లో ప్రమోషన్లను కూడా ప్లాన్ చేయాలి. నిజానికి మారుతి పోస్ట్ ప్రొడక్షన్ లో వీక్. మారుతి సినిమాల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాగోదు అని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ రిస్క్ చేయడం అవసరమా ?, ముఖ్యంగా మారుతి టెక్నికల్ విషయాల్లో పూర్తిగా తేలిపోతాడు. అలాంటి మారుతి ని పెట్టుకుని నాలుగు నెలల్లో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాని లాగించేయాలనుకోవడం తెలివైన పని అనిపించుకోదు.
పైగా దర్శకుడు మారుతి కి పాన్ ఇండియా సినిమా పూర్తిగా కొత్త. అందుకే, మారుతి పై కచ్చితంగా ఈ సినిమా విషయంలో తీవ్ర ఒత్తిడి ఉంది. అలాంటి ఒత్తిడిలో ఉన్న మారుతి ని నమ్ముకుని.. ప్రభాస్ ఏ నమ్మకంతో రిస్క్ చేయాలనుకొంటున్నాడో తనకే తెలియాలి.
ఇవి కూడా చదవండి…